‘బాహుబలి’ లీక్… స్టోరీ ఇదేనా?

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’. ఈ చిత్రం కోసం యావత్ భారత సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాహుబలి సినిమా కథ లీక్ అయిందంటూ వెబ్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది. వెబ్ మీడియాలో సందడి చేస్తున్న కథ మాత్రం ఆసక్తికరంగా ఉంది. స్టోరీలోకి వెళితే.. మాహిష్మతి రాజ్యానికి అధిపతి అమరేంద్ర బాహుబలి (ప్రభాస్), ఆయన భార్య దేవసేన (అనుష్క). వీరి పాలనలో ప్రజలు సుఖశాంతులతో చాలా ఆనందంగా ఉంటారు.

Baahubali poster

అయితే స్వార్ధపరుడు అయిన మంత్రి జిజ్జల దేవ (నాజర్) బాహుబలి సోదరుడు, భాల్లాలదేవ (రానా)తో చేతులు కలిపి అమరేంద్ర బహుబలిని యుద్ధంలో చంపి రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారట. రాజ్యం తమ ఆధీనంలోకి వచ్చిన తర్వాత భల్లాలదేవ రాజ్యంలో తన భారీ విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటాడు. అంతేకాదు ప్రజలని బానిసలుగా చూస్తుంటాడు. పసివాడైన బాహుబలి కుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు భల్లాలదేవ.
అయితే దేవసేన(అనుష్క) తన కుమారుడిని కాపాడి రాజ్యం దాటిస్తుంది. అయితే భల్లాల దేవా సైన్యం దేవసేనను బంధించి చరసాల పాలు చేస్తారని తెలుస్తుంది. ఆ నేపథ్యంలో చిన్నబహుబలిని కొందరు గ్రామస్థులు కాపాడుతారు, అంతేకాక అతన్ని పెంచి పెద్దవాడిని చేసి అతనికి శివుడు అని పేరు పెడతారని తెలుస్తుంది. శివుడు కూడా తండ్రి పోలికలతోనే ఉంటూ అందరిని తన ధైర్య సాహసాలతో ఆకట్టుకుంటూ ఉంటాడు.
అటువంటి పరిస్థితుల్లో శివుడు ఉండే ప్రాంతానికి రాజకుమారి అవంతిక (తమన్నా) వస్తుంది. ఆమె అందం చూసి శివుడు అవంతికని ప్రేమితాడు, ఆ తర్వాత శివుడు రాజకుమారిని వెత్తుకుంటూ తన మాహిష్మతి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ శివుడు గతం గురించి తెలుసుకొని భల్లాలదేవాపై ప్రతీకారం తీర్చుకొని రాజ్యాన్ని ప్రజలని, తన తల్లిని ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ సినిమా కథ అని వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఈ సినిమా స్టోరీ ఇంతేనా కాదో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.